మన భారతదేశ తక్షణ కర్తవ్యం ముందుకు కాకుండా వెనకకు మళ్ళడం
మన భారతదేశ తక్షణ కర్తవ్యం ముందుకు కాకుండా వెనకకు మళ్ళడం అంటే భారతీయ సనాతన ధర్మం అనే ఏ సంపద చూసి ప్రపంచం భారతదేశానికి మొక్కిందో,అది పునరుద్ధరణ జరిగి, కొంత మంది చేసిన దౌర్భాగ్యపు పనుల వలన జరిగిన నష్టాన్ని కూకటి వేళ్ళతో పెకలించి పూర్వ వైభవానికి అడుగులు వేయడమే ఉత్తమం ఏం ఒరిగింది ఈ అభివృద్ధి వల్ల. మహా అయితే దురద పెరిగింది. విపరీతాలు,వైపరీత్యాలు పెరిగాయి. కుటుంబ విలువలు నాశనం. ధర్మం,విలువలు,నీతి,న్యాయం పోయాయి. రోజూ పదిమంది కలిసి తినే ఇళ్ళు లేవు. అభివృద్ధి అంటే ఉన్న సంపదని నాశనం చేసుకుని అటువైపు ఇంకేదో ఉంది అని పాకులాడడం మూర్ఖత్వం 🙏 ఈ దిశగా అడుగులు పడాలి అంటే ఏం చేయాలి అని అంతర్మథనం జరగాలి, మీకేమైనా ఆలోచనలు ఉంటే పంచుకోండి నలుగురితో. ప్రశ్న వేయడం మంచిదే,కానీ సమాధానం దొరకలేదని ఆచరణే తప్పు అంటే అంత కన్నా మూర్ఖుడు ఉండడు ప్రపంచంలో. దానికి ఓపిక,సాధన,సహనం,శ్రద్ధ ఉండాలి. అవి కరువై,ధర్మాన్ని,ఆచారాన్ని తప్పు బట్టి వాటి నుండి దూరంగా జరిగి తప్పుకుంటే నష్టం ఎవరికి? అంతిమంగా సమాజమే నష్టపోయేది. సమాజం అంటే ప్రజలేగా. సనాతన ధర్మానికి వచ్చిన నష్టమేమీ లేదు ఎక్కడో దగ్గర మొలకెత్తుతూనే ఉంటుంది దాన్ని ఆపడం ఎవరి తరమ...